Monday, December 9, 2024

KNL | మ‌ళ్లీ ఆడ‌పిల్లేనా.. అనుమానంతో భ‌ర్త ఘాతుకం

కర్నూలు బ్యూరో : హోళగుంద మండ‌లం హెబ్బటంలో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం వెలుగుచూసిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా హోళ‌గుంద మండలం, హేబ్బటం గ్రామానికి చెందిన సకరప్ప, సలీమా(21) భార్యాభర్తలు. వీరికి మూడేళ్ల వయసు గల కుమార్తె సమీరా ఉంది. ప్రస్తుతం సమీరా గర్భిణి.

అయితే సమీరాకు తిరిగి ఆడపిల్లే పుడుతుందేమోనని భర్త ఘర్షణ పడేవారు. గురువారం రాత్రి వీరి మధ్య ఘర్షణ జరగ్గా, ఆవేశంతో సకరప్ప కర్రతో సలీమా తలపై కొట్టి చంపాడు. అదంతా పాప చూడడంతో చిన్నారిని కూడా గొంతునులిమి చంపి పోలీసులకు లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement