Friday, November 22, 2024

AP: ఓడితే ఈవీఎంలు మోసం చేసినట్లా ?… ఎంపీ కేశినేని శివనాద్

2019 గెలిచినప్పుడు మరి..?
ప్రజాస్వామ్యం పై నమ్మకం లేని వ్యక్తి జగన్..

(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో) : ప్రజాస్వామ్యంపై కనీస గౌరవం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాద్ పేర్కొన్నారు. ప్రజలు ఘోరంగా తిరస్కరిస్తే ఈవీఎంలపై అపవాదు మోపడం తగదన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన సందర్భంలో ఈవీఎంల ప్రస్తావన ఎందుకు చేయలేదని గుర్తు చేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు న్యాయం ప్రజాస్వామ్యం గురించి ఏరోజైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. ఈవీఎంల‌పై మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన ట్వీట్ పై విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) మండిపడ్డారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… 2019 లో జ‌గ‌న్ గెలిచిన‌ప్పుడు ఈవీఎంల‌పై ఇచ్చిన స్పీచ్ ను ప్లే చేసిన వినిపించారు. 2019లో ఈవీఎంలు బ్ర‌హ్మాండంగా ప‌నిచేస్తున్నాయన్న జ‌గ‌న్, ఇప్పుడు మాట మార్చ‌టంపై స‌మాధానం చెప్పాల‌ని ప్రశ్నించారు. ప్ర‌జ‌లెవ్వ‌రు కంప్లైయింట్ చేయ‌లేద‌ని.. వీవీఫ్యాట్ లో ఓటు వేసిన సింబ‌ల్ క‌నిపిస్తుంద‌న్న‌ జ‌గ‌న్ మాటలను ప్రస్తావించారు. ఓడిపోయిన త‌ర్వాత జ‌గ‌న్ ఈవీఎంల పై న‌మ్మకం లేదు…బ్యాలెట్ పేప‌ర్ కావాల‌ని కోర‌టం హాస్య‌స్పదంగా వుంద‌న్నారు.

ఇప్పుడు ఓడిపోయిన త‌ర్వాత జ‌గ‌న్ కి న్యాయం, ప్ర‌జాస్వామ్యం గుర్తొచ్చాయన్నారు. మాట మీద నిల‌బ‌డ‌లేని నాయ‌కుడు జగ‌న్ మోహ‌న్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. ప్ర‌జా తీర్పుని గౌర‌వించ‌లేక జ‌గ‌న్ మాట మార్చి మ‌డ‌మ తిప్పుతున్నాడనీ, ప్రజాస్వామ్యం గెల‌వ‌ట‌మే కాదు..గెలిచిన‌ట్లు క‌నిపించాల‌ని జ‌గ‌న్ వ్యాఖ్య‌నించ‌టం విడ్డూరంగా వుందన్నారు.

- Advertisement -

అలాగే రాజకోట రహస్యం బ‌య‌ట ప‌డింద‌న్నారు. నీ కోసం క‌ట్టించుకున్న వైజాగ్ ప్యాలెస్ భాగోతం ఎన్నిక‌ల ముందు బ‌య‌ట‌ప‌డి వుంటే.. వైసీపీకి ఆ 11 సీట్లు కూడా ప్ర‌జలు ఇచ్చే వారు కాదనీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాద్ పేర్కొన్నారు. వైజాగ్ ప్యాలెస్ కోసం ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేసిన దుర్మార్గుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని అన్నారు. భారీ స్థాయిలో ప్ర‌జా సొమ్ము దుర్వినియోగం చేయ‌టానికి ఇది రాష్ట్రమ‌నుకున్నావా..నీ సామ్రాజ్యం అనుకుంటున్నావా? అని ప్రశ్నించారు. జ‌గ‌న్ దుర్వినియోగం చేసిన సొమ్ము మొత్తం సీఎం చంద్ర‌బాబు నాయుడు క‌క్కిస్తాడని, క‌ట్టిస్తాడన్నారు. మ‌రోసారి ఏ నాయ‌కుడు ప్ర‌జా సొమ్మును దుర్వినియోగం చేయ‌కుండా చ‌ట్టాలు చేయాల‌ని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement