కడప: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కడప కోర్టు ఇవ్వాల కొట్టేసింది. ఉమాశంకర్ రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ తరుపు న్యాయవాదులు వాదించారు. వివేకా కేసులో ఉమా శంకర్ రెడ్డి కీలక నిందితుడిగా ఉన్నాడని సీబీఐ తన వాదనలు వినిపించింది. వివేకా హత్యకేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న ప్రస్తుత సమయంలో.. ఉమాశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోర్టును కోరింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కడప కోర్టు ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటి షన్ డిస్మిస్ చేసింది.
అతనికి బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడు.. ఉమాశంకర్ బెయిల్పై సీబీఐ, పిటిషన్ కొట్టేసిన కోర్టు
Advertisement
తాజా వార్తలు
Advertisement