ఏడుకొండలవాడు.. వేంకటేశ్వరస్వామి అంటే అందరికీ ఎంతో భక్తి భావం ఉంటుంది. కోరిన కోర్కెలు తీరిస్తే మొక్కు చెల్లించుకుంటామని చాలామంది పలు రకాల మొక్కులు మొక్కుతారు. ఎన్నో కోరకలు కోరుకుంటారు. ఎక్కువగా ఎడుకొండలు నడచి ఎక్కడం అనేది ప్రధాన మొక్కు కాగా, ఒక్కో మెట్టుకు పసుపు, కుంకుమ బొట్టుగా పెట్టడం, మోకాళ్లపై మెట్లు ఎక్కడం, మెట్టు మెట్టుకు ఆరతి కర్పూరం వెలిగించడం ఇట్లా చాలా రకాలుగా మొక్కుకుంటారు భక్తులు..
అయితే.. వారి మొక్కులు ఫలించి.. కోరికలు నెరివేరడంతో చాలామంది ఆ శ్రీవారికి మొక్కు తీర్చుకుంటారు. అందుకని ఏడుకొండలు నడవడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే ఇక్కడో వీడియో ఉంది.. అందులో ఏడుకొండలు నడిచి ఎక్కుతున్న ఈ భక్తులు ఏం చేస్తున్నారంటే.. తమ మొక్కు అయిన మెట్టు మెట్టుకూ ఆరతి కర్పూరం వెలిగించాల్సి ఉంటుంది.. దానికి బద్దకం తోడు కావడంతో టెక్నాలజీని వినియోగించి ఇట్లా మొక్కు తీర్చుకుంటున్నారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.. ఈ భక్తుల తీరును కొంతమంది లైక్ చేస్తుంటే ఇంకొందరు బద్దకం అంటే ఇట్లానే ఉంటుంది అని ట్రోల్ చేస్తున్నారు..
ఈ వీడియో కోసం www.prabhanews.com క్లిక్ చేసి వీడియో ట్యాబ్లో చూడొచ్చు..