డాక్టర్ ఎంవీ రమణారెడ్డి ఆదర్శప్రాయులని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఎంవీ రమణారెడ్డి జీవితం అందరికీ అనుసరణీయమని ఆయన పునరుధ్ఘాటించారు. తిరుపతిలో డాక్టర్ ఎంవీ రమణారెడ్డి ఆత్మకథ…గతించిన రోజులు పుస్తకావిష్కరణ సభ ఈరోజు ఉదయం స్థానిక ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ లో జరిగింది. రాయలసీమ అధ్యయనాల సంస్థ కన్వీనర్ భూమన అధ్యక్షత వహించగా, సీనియర్ పాత్రికేయులు శ్రీరామచంద్ర మూర్తి పుస్తకావిష్కరణ గావించారు. ఈ నేపథ్యంలో కరుణాకర రెడ్డి మాట్లాడుతూ… ఎంవీఆర్ నిబధ్ధత కలిగిన వ్యక్తిగా పేర్కొన్నారు. సీనియర్ పాత్రికేయులు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ… జ్ఞానపీఠ పురస్కారానికి ఎంవీ రమణారెడ్డి అర్హులన్నారు. రాయలసీమ ప్రజల కోసం, సీమ ప్రాంత నీటి సాధన కోసం, వాటి పరిష్కారాల కోసం ఎంవీ రమణారెడ్డి తుది శ్వాస విడిచే వరకు పోరాడారని ప్రశంసించారు.
డాక్టర్ ఎంవీ రమణా రెడ్డి కుమారుడు మురళీ మాట్లాడుతూ… తన తండ్రి జ్ఞాపకాలను వివరించారు. నిరంతర పోరాట యోధుడన్నారు. సభకు అధ్యక్షత వహించిన రాయలసీమ అధ్యయనాల సంస్థ కన్వీనర్ భూమన్ మాట్లాడుతూ… రాయల సీమ నీటి ప్రాజెక్టుల కోసం ఎంవీ ఆర్ విశేషంగా కృషి చేశారన్నారు. నిబద్ధత కలిగిన నాయకుడుగా పేర్కొన్నారు. ఎం వీ ఆర్ బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు. తిరుపతిలో తన తండ్రి ఆత్మకథ పుస్తకావిష్కరణ సభ నిర్వహించడం ద్వారా తిరుపతిలో సాహితీ వాతావరణం నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీషా, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్, ముద్ర నారాయణ, ఎం వీ ఆర్ కుమారుడు మురళీ, వైఎస్సార్ సాహితీ పురష్కార గ్రహీత స్వామి, సాహితీ మేధావులు శైల కుమార్, సాకం నాగరాజ, డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, డాక్టర్ బదేలా సుకుమార్ లు పాల్గొన్నారు.