ఇచ్ఛాపురం మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశంలో రగడ చోటుచేసుకుంది. మున్సిపల్ అధికారుల ప్రయాణాల కోసం నెలకు రూ.35 వేలు చొప్పున 12 నెలలకు రూ.4.20 లక్షలు కేటాయింపు అంశంపై దుమారం చెలరేగింది. ఎహెచ్ పి, బిఎల్ సి లబ్ధిదారుల సమస్యలకు పరిష్కారం చూపాలని సభ్యులు కోరారు. అక్రమ లే అవుట్లపై చర్యలకు చైర్ పర్సన్ ఆదేశించారు. సమావేశం చివర్లో సభ్యులు మాట్లాడుతుండగా చైర్ పర్సన్ ముగింపు పలికి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. మున్సిపల్ కళ్యాణమండపం వినియోగంలోకి తీసుకురావాలని టిడిపి కౌన్సిలర్ లీలారాణి కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement