శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పురపాలక సంఘం నూతన కమిషనర్ గా నల్లి రమేష్ బాధ్యతలు చేపట్టారు. రాజాం మున్సిపల్ కమిషనర్ పనిచేసిన ఆయన ఇక్కడికి బదిలీపై వచ్చారు. గతంలో ఇదే మున్సిపాలిటీలో పనిచేశారు. విధుల్లో చేరిన నూతన కమీషనర్ ను కార్యాలయం సిబ్బంది, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కమీషనర్ మాట్లాడుతూ.. తనకు పూర్తి సహకారం అందించాలని కోరారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ పిలక రాజలక్ష్మిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె శుభాభినందనలు తెలుపుతూ పురాభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేయాలని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement