Wednesday, November 20, 2024

AP | ఏపీలో పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు

ఏపీలో ఇటీవల పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి, కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబులకు ఈసీ ఆదేశాలతో స్థాన చలనం కలిగింది. కాగా, ఇప్పుడు వీరికి ఎన్నిక‌లతొఓ సంబంధం లేని శాఖ‌ల‌కు పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం వీరికి విధులు కేటాయించింది.

లక్ష్మీషాను ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవోగా నియమించింది. గౌతమిని టీటీడీ జేఈవోగా, రాజబాబును స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమించింది. పలువురు ఇతర ఐఏఎస్ లను కూడా వివిధ పదవుల్లో నియమించింది. మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ గా అంబేద్కర్ ను, పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీగా వెంకట్రామిరెడ్డిని, సీసీఎల్ఏ కార్యదర్శిగా ప్రభాకర్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement