ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారికి కోర్టు ధిక్కరణకు సంబంధించి మూడు నెలల జైలు శిక్ష ఖరారైంది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఇవ్వాల (శనివారం) కీలక తీర్పు వెలువరించింది. గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమిషనర్‌గా పనిచేసిన ఐఏఎస్ అధికారికి మూడు నెలల జైలుశిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. విశాఖ నగరంలో వీధి వ్యాపారులకు సంబంధించి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయని కారణంగా హరి నారాయణకు ఈ శిక్ష ఖరారైంది. అయితే ఈ శిక్ష అమలును 6 వారాలు వాయిదా వేస్తూ హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. నిందితుడు విస్తృత ధర్మాసనంలో తీర్పును సవాల్ చేసుకునేందుకే ఈ వెసులుబాటు ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. విస్తృత ధర్మాసనంలో కూడా ఈ తీర్పుపై స్టే విధించకపోతే.. జూన్ 16న హరి నారాయణ స్వయంగా హైకోర్టు రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.
కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారికి మూడు నెలల జైలు.. ఖరారు చేసిన హైకోర్టు
Advertisement
తాజా వార్తలు
Advertisement