Friday, November 22, 2024

AP: ఆయ‌న పొమ్మ‌న్నారు…ఇక ఉండలేను – ఎంపి కేశినేని

లోక్ స‌భ‌కు రాజీనామా చేయనున్న విజ‌యవాడ ఎంపి
స్పీక‌ర్ అనుమ‌తి కోరిన కేశినేని
టిడిపికి సైతం త్వ‌ర‌లో గుడ్ బై…
చంద్ర‌బాబు త‌ప్పులేద‌న్న నాని
ఎవ‌రి లెక్క‌లు వారివే అన్న ఎంపి
అనుచ‌రుల‌తో చ‌ర్చించి భ‌విష్యత్ కార్య‌చ‌ర‌ణ‌..

చంద‌ర్ల‌పాడు – ముందు లోక్ సభకు, ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తానని ఎంపీ కేశినేని నాని అన్నారు. రాజీనామ నిర్ణయం కేశినేని నాని స్పందిస్తూ… రెండేళ్ల క్రితమే రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నా అన్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపట్టనన్నారు.అధికారంలోకి రావాలంటే ఎన్నో స్ట్రాటజీలు ఉంటాయన్నారు. చంద్రబాబు పొమ్మన్న తర్వాత పార్టీలో ఉండడం సరికాదన్నారు. ఎన్నిసార్లు పోటీ చేసినా.. ఎప్పటికైనా మాజీ కావాల్సిందేనన్నారు. కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానన్నారు.

త్వరలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్టు తెలిపారు విజయవాడ ఎంపీ కేశినేని నాని.. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి త్వరలో రాజీనామా చేస్తాన‌ని చెప్పారు. లోక సభ స్పీకర్ అనుమతి కోరాను.. స్పీకర్ అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేస్తాన‌ని.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా లేఖ పంపుతాన‌ని వెల్ల‌డించారు.. ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు

ఇక, మా వాళ్లు ఏం చెయ్యమంటే అదే చేస్తాను అన్నారు కేశినేని.. ఇందులో నా సొంత నిర్ణయం ఉండద‌ని.. నేను ఏం చేసినా పారదర్శకంగా చేస్తాన‌న‌న్నారు.. ఏ నిర్ణయం తీసుకున్నా తెల్లవారు జామున సోషల్‌ మీడియా పోస్ట్‌ లో పెడతానన్నారు. తాను పెట్టే పోస్టులను మీడియా ఫాలో అవ్వటమే.. కానీ, రోజూ ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పలేను అన్నారు. రాజకీయ నేతగా, విజయవాడ ఎంపీగా సుదీర్ఘకాలంగా ఇక్కడ ప్రజల కోసం, ప్రాంతం కోసం పనిచేశాన‌ని,.. ప్రజలను, నాతో ఉన్నవాళ్లను వదిలేసి నిర్ణయాలు తీసుకోలేన‌న్నారు.. వారితో చర్చించిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు ఎంపీ కేశినేని నాని.

.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement