Tuesday, November 26, 2024

సీఎం జగన్ కు, వైసీపీకి ఎప్పుడూ దూరం కాను.. ఎమ్మెల్యే ఆర్కే

తాను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి తాను ఎప్పుడూ దూరం కానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. నిన్న జరిగిన వైసీపీ మీటింగ్ కు గైర్హాజరవ్వడంపై ఎమ్మెల్యే ఆర్కే క్లారిటీ ఇచ్చారు. పంటికి సర్జరీ జరగడంతోనే హాజరుకాలేకపోయానన్నారు. అలాగే మా అబ్బాయి పెళ్లి 16రోజుల ఫంక్షన్ కు హైదరాబాద్ వెళ్లానన్నారు. మంగళగిరి ప్రజలకు తనను దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ తోనే ఉంటానన్నారు. ఈ విషయాన్ని గతంలోనే శాసనసభలోనే చెప్పానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement