జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా తాము ఓడిస్తామని సవాలు చేశారు. పవన్ పోటీ చేసే నియోజకవర్గంలో తాను వైసీపీ ఇన్చార్జిగా పోస్ట్ తీసుకుంటానని, అక్కడ పార్టీ కోసం పనిచేసి పవన్ ను ఓడిస్తానని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. జనసేన కార్యకర్తలకు ఆయన మళ్లీ అన్యాయం చేస్తున్నారని, పార్టీని ప్యాకేజీ కోసం మళ్లీ తాకట్టు పెడుతున్నాడని ఆరోపించారు. త్వరలో జన సైనికులు బాధపడే రోజు వస్తుందని హెచ్చరించారు.
పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తా: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్
Advertisement
తాజా వార్తలు
Advertisement