Tuesday, July 2, 2024

AP | ‘మీతో మరో కప్ తాగాలనుకుంటున్నాను’ – ప్రధాని మోదీ ట్వీట్ పై సీఎం చంద్రబాబు స్పందన

ప్రధాని నరేంద్ర మోదీ అరకు కాఫీ రుచి అద్భుతం అంటూ… 2016లో చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగుతున్నప్పటి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ‘మీతో మరోసారి అరకు కాఫీ తాగేందుకు ఎదురుచూస్తున్నా’ అంటూ రీట్వీట్ చేశారు. అరకు కాఫీని గిరిజన సోదరీమణులు ప్రేమ, భక్తితో పండిస్తారని తెలిపారు. ‘2016లో మనం అరకు కాఫీ తాగుతున్న ఫోటోలను షేర్ చేసినందుకు, అరకు కాఫీకి ప్రచారం కల్పిస్తున్నందుకు థ్యాంక్యూ మోదీ గారూ. మీతో మరో కప్ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయాలని ఎదురుచూస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement