Friday, November 22, 2024

KNL: అమ్మ కావాలి.. జైలు ముందు చిన్నారి రోధన..

కర్నూలు బ్యూరో : ఓ చోరీ కేసులో పట్టుబడిన ఓ మహిళను పోలీసులు కారాగారానికి తరలించగా.. తల్లి కోసం కూతురు పడుతున్న వేదన ఇంత అంతా కాదు.. కర్నూలు నగర పాతబస్తీకి చెందిన ఒక మహిళ చోరీ కేసులో పట్టుబడి కర్నూలు నగరంలోని మహిళా సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది.

అయితే ఆమె ఏడేళ్ల కుమార్తె మాత్రం తన తల్లి కోసం మహిళా సబ్ జైలు బయట ఏడుస్తూ… పడుతున్న వేదనను చూస్తే మనసున్న వారికి గుండె కరగక మానదు. ఇది గమనించిన జైలు సిబ్బంది తమ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. పాపకు ఆమె తల్లిని ఒకసారి చూపించారు. ఆ తల్లి కూడా తన కూతురిని లోపలికి తీసుకెళ్లింది. అనంతరం జైలు అధికారులు వారి బంధువులను పిలిపించి పాపను ఇంటికి పంపడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement