Saturday, November 23, 2024

చ‌ట్ట ప్ర‌కార‌మే ముందుకెళ్లాను : ఏబీ వెంకటేశ్వరరావు

సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ రద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై.. ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. తానెప్పుడు చట్టప్రకారమే ముందుకెళ్లానని పేర్కొన్నారు. కేసును తప్పుదారి పట్టించిన వారి నుంచి రెవెన్యూ రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. తాను ఎప్పుడూ చట్ట ప్రకారమే ముందుకెళ్లాన‌న్నారు. ఎవరి కళ్లలో ఆనందం కోసం ఇదంతా చేశారు ? నన్ను, నా కుటుంబాన్ని క్షోభ పెట్టి ఏం సాధించారు ? సస్పెన్షన్‌ను ప్రశ్నించడమే నేను చేసిన తప్పా? నాపై వాదించే లాయర్లకు రూ.లక్షల ఫీజు చెల్లించారు. అసలు కొనుగోలే లేనప్పుడు అవినీతి ఎలా జరుగుతుంది ? కొందరు తప్పుడు కేసులతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చారన్నారు. తప్పుదారి పట్టించిన వారినుంచి రెవెన్యూ రికవరీ చేయాలన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు వదిలిపెట్టేది లేదని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement