Thursday, November 21, 2024

JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల … హైదరాబాదీ కి ఫస్ట్ ర్యాంక్

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2023 సెషన్‌-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. జేఈఈ మెయిన్‌లో హైదరాబాద్‌ విద్యార్థి సింగారపు వెంకట్‌ కౌండిన్య మొదటి ర్యాంక్‌ సాధించాడు. 300/300 మార్కులు స్కోర్‌ చేశాడు. కౌండిన్య పాఠశాల విద్య నుంచి ఇంటర్‌ వరకు హైదరాబాద్‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థల్లో చదివాడు. జూన్‌ 4వ తేదీన జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతానని కౌండిన్య తెలిపాడు..

ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్థులు..పి. లోహిత్‌ ఆదిత్య సాయి – నెల్లూరు – 2వ ర్యాంక్‌

సాయి దుర్గారెడ్డి – హైదరాబాద్‌ – 6వ ర్యాంక్‌

కె.సాయినాథ్‌ శ్రీమంత – అమలాపురం – 10వ ర్యాంక్‌

30 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్‌

- Advertisement -

జేఈఈ మెయిన్‌లో కనీస కటాఫ్‌ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత కల్పిస్తారు. వారు ఈనెల 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు మే 7వ తేదీ తుది గడువు. జూన్‌ 4వ తేదీన జరిగే పరీక్ష ఫలితాలను జూన్‌ 18వ తేదీన వెల్లడిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement