తిరుమల, ప్రభన్యూస్:తిరుమల శ్రీవారి భక్తులు సమర్పించి న హుడీ కాను కలను నూతన పరకామణి భవనంలో ఆదివారం ఉదయం నుండి లెక్కించడం ప్రారంభించినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ సహకా రంతో ఈ భవానన్ని అత్యాధునిక భద్రతతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత ఏడాది సె ప్టెంబ ర్ 28న ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నూతన పరకా మణి భవనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
ఇందులో సీసీ కెమెరాలు, ఇతర మౌలిక వసతులు కల్పన పూర్తయినందున ఆదివారం ఉదయం నుండి కాను కలను లెక్కించడం ప్రారంభించినట్లు తెలియజేశారు. అనంతరం పెద్దజీయర్ స్వామి ఆశీస్సులతో ఉదయం 5.30 గంటలకు శ్రీవారి ఆలయం నుండి 12 హుం డీలు చిన్న లిఫ్ట్ సహకారంతో లారీలో తరలించినట్లు చెప్పారు. ఇకపై ప్రతిరోజూ అన్ని హుండీలు నూతన పరకామణి భవనానికి చేరుకుంటా యన్నారు. నెలరో జుల తర్వాత ఆలయంలోని పరకామణి మండపాన్ని భక్తులు కూర్చునేందుకు తీర్చిదిద్దనున్నట్లు ఈవో వివరించారు.అంతకుముందు నూతన పరకామణి భవనంలో వాస్తు హోమం, గోపూజ, శ్రీవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పరకామణి లెక్కింపును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఈ నాగేశ్వరరావు, ఎస్‌ఈ-2 జగదీశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ఈవో, పరకామణి ఇన్‌చార్జి రాజేంద్రకుమార్, ఈఈలు శ్రీహరి, జగన్‌మోహన్‌రెడ్డి, డీఈ రవిశంకర్‌రెడ్డి, వీజీవో బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.