Wednesday, November 20, 2024

పోలీసుల మాన‌వ‌త్వం.. వృద్ధురాలికి అంతిమ సంస్కారాలు

ఆగిరిపల్లి : పోలీసులు మాన‌వ‌త్వాన్ని చాటారు. కొడుకులున్నా ప‌ట్టించుకుని త‌ల్లి చ‌నిపోవ‌డంతో ఆమె మృత‌దేహానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. ఓ వృద్ధురాలి భ‌ర్త‌ ప‌క్ష‌వాతంతో బాధ‌ప‌డుతూ మంచంలో ఉన్నాడు. ఆయ‌న భార్య‌కు అనారోగ్యం తీవ్రం కాగా ఆ మాతృమూర్తి తనువు చాలించింది. దహన సంస్కారాలు నిర్వహించేందుకు కన్నబిడ్డలు ఉన్నప్పటికీ,ఆస్తులు పంచలేదన్న అక్కసుతో ఉన్నారు. తల్లిని క‌డ‌సారి చూసేందుకు కూడా ఆ బిడ్డలు రాలేదు. దీంతో అనాథగా మారిన ఆ మాతృమూర్తికి అన్నీ తామే అయి స్థానిక పోలీసులు దహన సంస్కారాలు నిర్వహించారు.

ఆంధ్రప్ర‌దేశ్‌లోని ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం, నూగొండపల్లి గ్రామానికి చెందిన పామర్తి వనజాక్షి భర్త పక్షపాతంతో మంచలో ఉండగా, ఆస్తి పంచలేదని కొడుకు, కూతురు దహన సంస్కరాలకు రాకుండా, మృత‌దేహాన్ని అనాథ‌లా వ‌దిలేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై నంబూరి చంటి బాబు స్పందించి, ఏ ఎస్ఐ శ్రీనివాస రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ చంద్ర శేఖర్ను నూగొండపల్లి పంపించారు. వారిరువురు గ్రామ ప్రజల స‌హాయంతో అంత్య‌క్రియ‌లు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. ఈ సంద‌ర్భంగా పోలీసుల‌ను మండల ప్రజలు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement