Friday, November 22, 2024

Human Trafficking – బాలిక‌లతో బిజినెస్‌! …. జాబ్స్​ పేరిట యువతకు వల


వామ్మో.. ఏపీలో హ్యుమన్​ ట్రాఫికింగ్​
మానవ అక్రమ రవాణాలో బీహారీలు.. ఆంధ్రులే టాప్
యూపీలో దొరికిన 190 మంది బాలలు
మదర్సాలలో చ‌దువుల కోసం త‌ర‌లిస్తున్న వెల్ల‌డి
ఏపీ నుంచి కాంబోడియాకు 150 మంది యూత్
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం పేరుతో వల
ఇప్పటికీ 30 వేల మంది ఆడబిడ్డల జాడ లేదు
ఆందోళన వ్యక్తం చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్
బెంగళూరు, ముంబ‌యిలో మగ్గుతున్న ఏపీ బాలికలు

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి పేదింటి బిడ్డలే టార్గెట్‌.. ఆ పిల్ల‌ల గురించి అయితే ఎవ‌రూ ప‌ట్టించుకోర‌నే దురాలోచ‌న‌.. అందుకే అక్రమ మానవ రవాణా మాఫియాకు కోట్లు పండించే సిరి సంపదగా పేద‌లు మారిపోయారు. మగ పిల్లల శ్రమ దోపిడీకి, అమ్మాయిలేమో వేశ్య వాటిక‌ల‌కు చేరుతున్నారు. అందుకే దేశంలో ట్రాఫి‘కింగ్’ల చెలగాటం విస్తరిస్తోంది. దేశం నుంచి పరాయి దేశాలకూ పసిబిడ్డల్ని తరలించి కోట్లకు కోట్లు అర్జిస్తున్నారు. ఈ మానవ మృగాలకు మదర్సాలు ఆశ్రయం ఇస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఉపాధి పేరిట యువతను ఇతర దేశాలకు తరలించే ముఠా సంగతి సరే సరి. అరబ్ కంట్రీల్లో దినార్ల పంట పండుతుందని, అక్కడ రెండు సంవత్సరాలు పని చేస్తే చాలు… సొంతూరి అప్పులు తీరిపోగా.. బంగారు నగలు ధరించే స్థాయికి చేరుతామనే ప్రచారాని అసలు కళ్లెం పడటం లేదు. తీరా విమానం ఎక్కి విదేశాలకు వెళ్తే.. అక్కడ బానిసలుగా మగ్గిపోతున్నారనే నిజాలు వెలుగు చూడటం లేదు. ఏదన్నా ప్రమాదం జరిగినా… ఏదన్నా కేసుల్లో ఇరుక్కున్నా ఉరితాడులు తప్పటం లేదు.ఇలా వలస వెళ్లినోందరూ బానిసలు కారు…కానీ వలస మాఫియా తరలించే అక్రమ రవాణే.. కారణం. దీనికి ఎందుకు బ్రేకులు పడటం లేదు. ఈ మ‌ధ్య బీహారీ పిల్లలు, ఆంధ్రా యువత అక్రమ ర‌వాణా వెలుగులోకి రావ‌డంతో పోలీసులు పెద్ద ఎత్తున ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

- Advertisement -

కాంబోడియా వల…

డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాల పేరుతో 150 మంది నిరుద్యోగులను కాంబోడియాకు తరలించారు. అక్కడికి చేరిన తరువాత చైనా మాఫియాకు అమ్మేశారు. బలవంతంగా సైబర్‌ స్కామ్‌ ల్లోకి దించారు. పెడెక్స్‌ స్కామ్‌లోకి సామాన్యులను ఎలా దించాలో శిక్షణ ఇస్తారు. అసలు విషయం తెలిసే లోపు వీరందరూ డ్రగ్స్ బాబులుగా మారిపోరారు. తొలుత నెలకు 1000 డాలర్లు జీతం అంటారు. తరువాత 600 డాలర్లే ఇస్తారు. ఇదేమంటే… చిత్రహింసలు తప్పవు. ఇటీవల విశాఖ కేంద్రంగా కాంబోడియా వలస మాఫియా కథ పోలీసులకు తెలిసింది. ఒక్కొక్క నిరుద్యోగి నుంచి రూ. లక్షన్నర చొప్పున వసూలు చేసి ఇందుల్లో 80 శాతం కాంబోడియా ముఠాకు మిగత సొమ్ము జేబులో వేసుకొంటున్నారు. వీరు తీసుకుంటున్నారని తెలిపారు. ఎట్టకేలకూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు ఈ మాఫియా చెర నుంచి తప్పించుకుని .. అసలు కథను విశాఖకు చేరవేయగా.. ఈ గుట్టు రట్టయింది.

మదర్సాల బురఖా…

బీహార్ లోని వివిధ జిల్లాలకు చెందిన 93 మంది బాలలను తొమ్మిది మంది ఏజెంట్లు సేకరించారు. పిల్లలందరినీ ఢిల్లీకి చేర్చటం వరకే ఏజెంట్ల పని. పాట్నాలో బయలు దేరారు. అప్పటికే బీహార్ నుంచి పెద్ద సంఖ్యలో పిల్లలను తరలిస్తున్నారని రైల్వే ఫ్రొటెక్షన్ ఫోర్స్ కు సమాచారం వచ్చింది. ఈ స‌మాచారం అందుకున్న ఆర్పీఎఫ్ ఫోర్స్ రైల్వే స్టేషన్‌లో మొహరించింది. చిన్నారులను కాపాడింది. ఆగంతకులను అదుపులోకి తీసుకుంది. ఈ పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించింది. పిల్లలను తరలిస్తున్న తొమ్మిది మంది ఏజెంట్లను ఆర్‌పీఎఫ్ బృందం అరెస్టు చేసింది. పిల్లలను తీసుకెళ్లేందుకు అవసరమైన అనుమతి పత్రాలను వారు చూపించలేకపోయారు. అయితే.. పిల్లలను మదర్సాలలో చదివించేందుకు తీసుకువెళుతున్నారని ఏజెంట్ చెప్పారు.

మరో 95 మంది బాలల కథ

ఉత్తర్‌ప్రదేశ్ చైల్డ్ కమిషన్ ఏప్రిల్ 27న (శుక్రవారం) ఏకంగా 95 మంది చిన్నారులను రక్షించింది. ఆ చిన్నారులను బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు అక్రమంగా తీసుకెళ్తున్నట్లు క్రమంలో అధికారులు పట్టుకున్నారు. బీహార్‌లోని వివిధ జిల్లాల నుంచి 99 మంది పిల్లలనుబస్సులో సహరాన్‌పూర్‌కు తీసుకెళ్తున్న ఐదుగురు మత గురువులను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు చెందిన మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పట్టుకుంది.బీహార్‌లోని అరారియా, పూర్నియా ప్రాంతాల నుంచి సహరాన్‌పూర్‌లోని దేవ్‌బంద్‌కు చాలా మంది పిల్లలను అక్రమంగా తీసుకెళ్తున్నట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు డాక్టర్ సుచితా చతుర్వేదికి సమాచారం అందింది. దీంతో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగానికి సమాచారం అందించారు. ఆ తరువాత అయోధ్య పోలీసుల యూనిట్ నగరంలోని బడి దేవ్‌కలి సమీపంలో హైవేపై బస్సును నిలిపి 95 మంది చిన్నారులు కనిపించారు. వీరితోపాటు ఐదుగురు మౌల్వీలు ఉన్నారు. ఆ క్రమంలో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఇలా 95 మంది బాలలూ 9 నుంచి 13 ఏళ్ల పిల్లలే. వీరందరీ లక్నోలోని ముంతాజ్ ఆశ్రమంలో ఉంచారు.దొరికిన అయిదుగురు మౌల్వీలూ నకిలీలని తేలింది.

ఏపీలోనే ట్రాఫికింగ్స్ ఎక్కువ ?

బాలల అక్రమ రవాణాలో ఉత్తర ప్రదేశ్, బీహార్ సహా ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రస్థానంలోనే ఉందని కేంద్ర నిఘా సంస్థల రికార్డులు చెబుతున్నాయి. కోవిడ్ కు ముందు తరువాత బాలల అక్రమ రవాణా క్రమేపీ కాదు… బాగా పెరిగింది. 9 నుంచి 12 ఏళ్లలోపు బాల బాలికల అక్రమ రవాణాలో .. దేశ వ్యాప్తం 21 రాష్ర్టాల్లో 261 జిల్లాలు రికార్డు సృష్టించాయి. వీరిలో 15.6 శాతం మంది హోటల్స్ లో, 13 శాతం మంది ఆటోమొబైల్స్ లో వెట్టి చాకిరి చేస్తున్నారు. 11 శాతం బాలికలు వేశ్యగృహాల్లో మగ్గిపోతున్నారు. ఇక తాజాగా మదర్సా ముసుగులో తరలిస్తున్న బాలల గమ్యం ఏమిటీ? మరీ ముఖ్యంగా ముస్లీం బిడ్డల్నే ఎందుకు టార్గెట్ చేశారు. సాధారణంగా ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి కాస్మొపోలిటిన్ సిటీల్లో.. యాచక మాఫియా కూడా పిల్లల్ని కొనుగోలు చేస్తోంది. కానీ.. బీహార్ నుంచి ముస్లీం పిల్లల తరలింపే అనేక అనుమానాలకు తావిస్తోంది. సిరియాలో ఉగ్రవాదుల అవసరాలను తీర్చటానికి వీరిని తయారు చేస్తున్నారా? గతంలో లవ్ జిహాద్ పేరిట యువతులను ఏమార్చిన ఘటనలెన్నో ఉన్నాయి. ఇప్పడు మదర్సాల్లో చదువులు పేరిట నిరుపేద బిడ్డల్ని తరలించమే .. భయాందోళనకు దారితీస్తోందని మానవ హక్కుల సంఘాలు సైతం అనుమానిస్తున్నాయి. ఏది ఏమైనా… కూడు, గుడ్డ, నీడ లేని పేదలు.. ఉపాధి కోసం మధ్యతరగతి బిడ్డలే టార్గెట్ గా.. ఈ ట్రాఫికింగ్ మాఫియా చెలరేగిపోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement