రామకుప్పం, ( ప్రభ న్యూస్) : మండలంలోని పలు పంచాయతీల్లో గత పదిహేను రోజుల నుండి మూడు ఏనుగులు హల్ చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే…. సోమవారం రాత్రి ముదనపల్లి ఆవుల కుప్పం కంబాల దేవనపల్లి, అతి కుప్పం, నాకు బాలేపల్లి, ఇంకా కొన్ని గ్రామాల్లో ఈ మూడు ఏనుగులు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. అదేవిధంగా కొన్నిచోట్ల పంట నష్టాలు, రాతి స్తంభాలు, మామిడి చెట్లు ధ్వంసం చేసినట్లు రైతులు తెలియజేశారు. అటవీ అధికారులు ఏ మాత్రం శ్రద్ధ వహించకుండా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు తెలియజేశారు. ఇకనైనా జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకొని ఏనుగులను అడవిలో వదిలే విధంగా చూడాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital