ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా పదోన్నతులు లభించనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 41 మండలాల్లో మహిళా కాలేజీలున్నాయి. 202 మండలాల్లో అసలు కాలేజీలే లేవు. ఈ మండలాల్లో ఒక కో ఎడ్యుకేషన్, ఒక బాలికల జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అంటే 202 మండలాల్లో 404 జూనియర్ కాలేజీలు రానున్నాయి. మరో 429 మండలాల్లో ఒక్కో బాలికల కళాశాల ఏర్పాటు కానుంది.
త్వరలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులకు భారీ ఎత్తున పదోన్నతులు లభించనున్నాయి. ఇందుకు సంబంధించిన నోట్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నోట్‌ను అన్ని జిల్లా, డివిజన్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పంపించింది. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేయడం వల్ల వచ్చే జూన్‌లోగా 30వేల మంది SGTలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందనున్నారు. అటు రాష్ట్రంలో కొత్తగా 833 జూనియర్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. దీంతో స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్, ప్రధానోపాధ్యాయులకు ప్రిన్సిపాల్ స్థాయి పదోన్నతులు లభించనున్నాయి. మిగతా విభాగాల్లోనూ ప్రమోషన్లు వర్తించనున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..