Monday, November 18, 2024

AP | స్థానిక సంస్థలకు భారీగా నిధులు విడుదల..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల కోసం భారీగా నిధులు విడుదల చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు స్థానిక సంస్తల కోసం రూ.1452 కోట్లను విడుదల చేశారు. గ్రామపరిధిలోని స్థానిక సంస్థలకు రూ.998 కోట్లు, పట్టణ పరిధిలోని స్థానిక సంస్థలకు రూ.454 కోట్లు చొప్పున ఆర్థిక శాఖ కేటాయించింది.

గత వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిన 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పయ్యావు కేశవ్ అన్నారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన నిధుల ద్వారా స్థానిక సంస్థలకు ఆర్థికంగా వెసులుబాటు కలగనుందని పయ్యావు తెలిపారు.

నిధులు విడుదలైన నేపథ్యంలో పనుల్లో వేగం పెంచాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్లు పయ్యావుల తెలిపారు. అలాగే గ్రామాల అభివృద్ధితోనే ప్రగతి సాధ్యమన్న బాపూజీ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తామని మంత్రి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement