ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రహదారుల అభివృద్ధికి రూ.252.42 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం కేంద్ర మంత్రి నితన్ గడ్కరీ ట్విట్టర్‌లో కీలక ప్రకటన చేశారు.
శ్రీకాకుళంలోని రణస్థలం వద్ద ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధి, ఆధునీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో పాటు రహదారి భద్రతను మెరుగుపరుస్తుందని గడ్కరీ చెప్పారు. ఈ ప్రాజెక్టుతో చాలా మందికి ఉపాధి లభిస్తుందని, తద్వారా ఈ ప్రాంత ప్రజల జీవితాలు కూడా మెరుగుపడతాయని పేర్కొన్నారు.