Saturday, September 14, 2024

తుంగభద్రకు జల కళ.. శ్రీశైలం దిశగా కృష్ణమ్మ

కర్నూలు బ్యూరో : శ్రీశైలం జలాశయంకు జలకళ ఉట్టిపడుతుంది. గురువారం ఎగువ జూరాల నుంచి నీటిని విడుదల చేయడంతో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ శ్రీశైలం జలాశయం చేరుకుంటుంది. మరోవైపు కర్ణాటకలోని హోస్పేట్ నుంచి తుంగభద్ర నీటి పరవళ్లతో తరలివస్తుంది. దీంతో శ్రీశైలం డ్యాంకు జలకళ ఉట్టిపడుతుంది. ఎగువ నుంచి వరద ప్రవాహం శ్రీశైలంకు చేరుతుండడంతో కుడి, ఎడమ విద్యుత్ కేంద్రంలో ముమ్మరంగా విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. మరోవైపు డ్యాం పరిధిలోని కాలువలకు భారీగా నీరు విడుదలవుతుంది.

శ్రీశైల జలాశయం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 806.60 అడుగులుగా ఉంది. ఇదే సమయంలో జలాశయం కు ఇన్ ఫ్లో 25,174 క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతుంది. ఇక జలాశయం నుంచి 20557 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుంది. వీటిలో భాగంగా కుడి, ఎడమ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ముమ్మరంగా సాగుతుంది.

ఇందులో ఏపీ పరిధిలోని కుడి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 12618 క్యూసెక్కులు వినియోగించి 5.761 మెగా యూనిట్లు, ఎడమ విద్యుత్ కేంద్రంలో 7888 క్యూసెక్కుల నీటి వినియోగంతో 3.515 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇక జలాశయంలో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను ప్రస్తుతం 32.3782 టీఎంసీల నీటి నిల్వలు ఉండటం గమనార్హం.

ఇదే సమయంలో జూరాల నుంచి 25174 క్యూసెక్కులు శ్రీశైలం డ్యాంకు చేరుకుంటుంది. కాగా ఉదయం శ్రీశైల జలాశయం నీటిని వినియోగించి విద్యుత్ ఉత్పత్తిని చేసిన ఏపీ సాయంత్రంకు నిలిపివేసింది. ఇక ఇదే సమయంలో ఎడమ విద్యుత్ కేంద్రంలో 7064 క్యూసెక్కుల నీటిని వినియోగించి విద్యుత్ ఉత్పాదనను కొనసాగిస్తూ వచ్చారు..

- Advertisement -

తుంగభద్రకు 1.12 లక్షల క్యూసెక్కుల వరదనీరు

పోస్ట్మేట్ పరిధిలోని తుంగభద్ర డ్యామ్ కు వరద ప్రవాహం జోరు సాగుతుంది. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగుల గాను, ప్రస్తుతం 1615.67 అడుగులుగా ఉంది. ఇక జలాశయం లో నీటి నిలువలు 105 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 50.025 టిఎంసిల నీరు నిలువ ఉంది.

ఇక జలాశయంకు ఎగువ నుంచి 112498 క్యూసెక్కుల నీరు వచ్చి చేరితుండగా, ఇక జలాశయం నుంచి దిగువకు 411 క్యూసెక్కుల నీరు వెళుతుంది. ఇందులో హెచ్ఎల్ సి, ఎల్ ఎల్ సి, ఎల్ఎల్ సి ఏపీకి నీరు విడుదలవుతుంది. ఇదే సమయంలో తుంగభద్ర డ్యాంకు తుంగ, భద్ర నుంచి వరద ప్రవాహం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement