Sunday, January 5, 2025

Tirupati – అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

తిరుపతి బ్యూరో ఆంధ్రప్రభ – తిరుపతి జిల్లా పెళ్లకూరు మండల పరిధిలోని పెన్నేపల్లి గ్రామ సమీపంలో ఏర్పాటు చేసి ఉన్న అగర్వాల్‌స్టీల్‌ పరిశ్రమలో ఒక్కసారిగా బాయిలర్‌ పేలడంతో భారీ మంటలు చెలరేగి 10 మంది కార్మికులకు తీవ్రగాయాలు కాగా మరికొంతమందికి స్వల్ప గాయాలైయ్యాయి. దీంతో పరిశ్రమ యాజమాన్యం క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు.

గతంలో కూడా ఈ పరిశ్రమలో బాయిలర్‌ పేలిన ఘటన చోటు చేసుకుని ఉందని మళ్లీ అదే ఘటన పునరావృతం కావడంతో పున్నేపల్లి గ్రామస్తులు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా కారణంగానే ఇలాంటి ప్రమాదాలు ఈ పరిశ్రమలో సంభవిస్తున్నాయని కార్మికులకు కనీస రక్షణ చర్యలు చేపట్టడం లేదని కార్మికులతో పాటు గ్రామస్తులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

సంఘటన స్థలాన్ని స్థానిక డీఎస్పీ చెంచుబాబు, రూరల్‌ సీఐ సంఘమేశ్వరరావులు, ఎస్‌ఐ నాగరాజు, అజయ్‌కుమార్‌లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. కాగా, ఈ అగ్ని ప్రమాదం వలన భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు యాజమాన్యం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement