రాజధాని అమరావతికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే పలువురు స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విరాళాలు అందించగా.. తాజాగా, కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన పి.విజయలక్ష్మి రూ.కోటి విరాళంగా ఇచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆయన ఈ మేరకు చెక్కును అందించారు.
ప్రస్తుతం హైదరాబాద్ ఫిల్మ్నగర్లో నివాసం ఉంటున్న విజయలక్ష్మి… తమకున్న కొద్దిపాటి భూమిని అమ్మి… తన తల్లి కోరిక నెరవేర్చేందుకు ఈ విరాళం ఇస్తున్నట్లు ఆమే తెలిపారు. పి.విజయలక్ష్మి త్యాగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన విరాళం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు.