ఆధార్ కార్డు కోసం పాట్లు తప్పడం లేదు. ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం తుది గడువు సమీపిస్తుండటంతో.. తెల్లవారుజాము నుంచే నమోదు కేంద్రాల వద్ద పిల్లా పాపలతో జనం బారులు తీరుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌తో ముడిపెట్టడంతో లబ్ధిదారులంతా తమ కార్డులు సరిచేసుకునేందుకు ఆధార్ కేంద్రాలకు పరుగులు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయూత పథకాన్ని చేపట్టంది. ఆధార్ తో ఫోన్ నంబర్ లింక్ అయితేనే చేయూత పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. జూన్1 వరకే తుది గడువుగా పేర్కొంది. దీంతో ఆధార్ కేంద్రాల వద్ద మహిళల పాట్లు పడుతున్నారు. భారీగా క్యూలో గంటల తరబడి నిలబడుతున్నారు. కరోనా సమయంలో ఇటువంటి నిబంధనలు అవసరమా అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో కరోనాను మరచి ప్రభుత్వ పధకాల కోసం మహిళలు బారులు తీరారు. జగనన్న చేయూత పధకం కోసం ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరి క్యూలో నిలుచున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.