తిరుపతి నగరంలోని డ్రైనేజీ సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులకు నగర మేయర్ డాక్టర్ శిరీష సూచించారు. బుధవారం మధ్యాహ్నం 27 వ డివిజన్ లో మేయర్ పర్యటించి తాతయ్య గుంట, గంగమ్మ గుడి వద్ద, పెద్ద మురుగుకాలువ పొంగిపొర్లుతున్న డంతో మున్సిపల్ కార్పొరేషన్ జెసిబి ని పిలిపించి పెద్ద కాలువ ను అక్కడికక్కడ శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా నగర మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఇటీవల తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని కొన్నిచోట్ల డ్రైనేజీలు బ్లాక్ అయి సమస్యలు తలెత్తుతున్నాయని తక్షణం నగర పరిధిలోని డ్రైనేజీల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. అలానే వర్షపు నీరు ఎక్కడా నిలువకుండా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా గంగమ్మ గుడి వద్ద ఉన్న పెద్ద కాలువలో సమస్య ఎప్పటినుండో ఉందని ఈ కాలువకు శాశ్వత పరిష్కారం గా డ్రైనేజీ నిర్మాణానికి టెండర్లు పిలవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ దేవకి, శానిటరీ ఇన్స్పెక్టర్ సుమతి, వైసీపీ బీసీ నాయకులు తులసి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని డ్రైనేజీ సమస్యలను పరిష్కరించండి
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement