ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఆయన సస్పెన్షన్ ఎంతకాలం కొనసాగిస్తారని జగన్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదన్న నిబంధనలు గమనించాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిర్దేశాలు కోరామన్న రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సస్పెన్షన్ కొనసాగించేందుకు నిర్దేశాలు కోరినట్లు కోర్టుకు తెలిపారు. రెండేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశాలు అడుగుతారా అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు… రేపటిలోగా అన్ని వివరాలతో రావాలని పేర్కొంది సుప్రీంకోర్టు ధర్మాసనం. రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ కొనసాగించాలన్న వాదనలకు ఆధారాలు చూపాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌ఎల్‌పీపై జోక్యానికి ఆధారాలు కనిపించట్లేదన్న ధర్మాసనం… రేపటి తర్వాత విచారణ వాయిదా వేయడం కుదరదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకోవాల్సిందేనని ఆదేశించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎంతకాలం : ఏపీ సర్కార్ ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
Advertisement
తాజా వార్తలు
Advertisement