అమరావతి, ఆంధ్రప్రభ గృహ వినియోగదారులకు స్టార్ రేటెడ్ ఎలక్ట్రాన్రిక్ గృహోపకరణాల సరఫరా చేసే ప్రాజెక్టును ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటో-ంది. తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించేందుకు రాష్ట్ర ఇంధన శాఖ ఆమోదం తెలిపింది. పైలట్ ప్రాజెక్ట్ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో విజయవంతంగా పూర్తయిన తర్వాత దశలవారీగా ఉపకరణాలను రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేయడానికి ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి ఆన్ బిల్ ఫైనాన్సింగ్ మోడల్, అప్ ఫ్రంట్ మోడల్‌పై విధివిధానాలను రూపొందించాల్సిందిగా ఏపీ సీడ్కో, డిస్కాములను ఏపీ ఎలక్ట్రిస్రిటీ రెగ్యూలేటరీ కమిషన్ (ఏపీఈఆర్సి) ఆదేశించింది. ఈమేరకు ఆదివారం విద్యుత్ సంస్థలతో ఏపీఈఆర్సి చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంధన సామర్థంతో కూడిన ఎలక్ట్రాన్రిక్ గృహోపకరణాలను సరఫరా చేయటంపై పలు సూచనలు చేసారు. రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు స్టార్ రేటెడ్ ఎయిర్ కండీషనర్‌లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు వంటి వాటిని సరఫరా చేయడంపై ఏపీ సీడ్కో, డిస్కంలకు ఆదేశాలు ఇచ్చారు. ఈస్టార్ రేటెడ్ గృహోపకరణాలు వాడటం వల్ల ఇళ్లలో విద్యుత్ వినియోగం తగ్గడం, తద్వారా నెలవారీ కరెంటు- బిల్ కూడా తగ్గుతుంది.
అంతేగాక ఈ ఎలక్ట్రాన్రిక్ వస్తువుల వాడకం వల్ల ఇళ్లలో వెలువడే కాలుష్య వాయువులు తగ్గి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అంతిమంగా ఇది పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని ఏపీఈఆర్సీ చైర్మన్ తెలిపారు. ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలోని మొత్తం విద్యుత్ డిమాండ్ లో 25 శాతం గృహాల్లోనే వినియోగమవుతుంది. ఈదృష్ట్యా ఆసక్తి కలిగిన గృహ వినియోగదారులకు ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా స్టార్ రేటెడ్ ఉపకరణాలను పంపిణి చేయాలని విద్యుత్ సంస్థలకు ఏపీఈఆర్సీ చైర్మన్ సూచించారు. అయితే అల్పాదాయ వర్గాల వారు ఒకేసారి పెద్ద మొత్తం వ్యయం చేసి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనే అవకాశాలు తక్కువగా ఉంటాయనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్ బిల్ ఫైనాన్సింగ్ మోడల్‌ను అమలు చేయాల్సిందింగా సూచించారు. దీనిలో వినియోగదారులు నెల వారి వాయిదా పద్దతిలో కొంత మొత్తం చొప్పన వస్తువుల ధర చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఒకేసారి కొనగలిగిన వారికి అప్ ఫ్రంట్ మోడల్‌ను కూడా రూపొందించడం జరిగింది. ఈ రెండు పద్ధతుల్లోనూ కొనేవారికి వస్తువు ధరపై కొంత మేర డిస్కౌంట్ కూడా లభిస్తుంది. స్టార్ రేటెడ్ గృహోపకరణాల వినియోగంపై పెద్ద ఎత్తున వినియోగదారులలో అవగాహనా కల్పించాలని ఏపీఈఆర్సీ చైర్మన్ విద్యుత్ సంస్థలకు సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..