Tuesday, November 19, 2024

రోగులపై ఆసుపత్రి సిబ్బంది దాడి.. కోవిడ్‌ టెస్టులు చేస్తారా అని అడిగినందుకు..

కర్నూలు టౌన్ , (ప్రభన్యూస్‌) : ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోగులపై సిబ్బంది దాడికి దిగారు. డాక్టర్లు, సిబ్బందికి తమ హోదాను అడ్డుపెట్టుకుని ఇష్టారీతిన వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల దయాదాక్షిణ్యం లేకుండా ఆసుపత్రిలో పై స్ధాయి నుంచి కింది స్ధాయి వరకు ఇండియా బార్డర్‌ లా వ్యవహరిస్తున్నారు. రోగుల పట్ల స్నేహపూర్వతగా మెలగకపోగా వివక్ష తరహాలో నడుచుకుంటున్నారు. మధ్యాహ్నం వరకు కాలక్షేపం చేసి మధ్యాహ్నం తర్వాత ప్రైవేట్‌ ఆస్పత్రులు, సొంత క్లీనిక్‌లకు వెళ్తున్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రులతో మిలాఖత్‌ అయి కన్సల్టెంట్‌ ఆపరేషన్‌ పైనే దృష్టి ఉంచి ప్రభుత్వ ఆసుప త్రికి వస్తున్న రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. కనీసం మర్యాదపూర్వకంగా సమాధానం చేప్పే ఓపిక కూడా లేకుండా సహనం మరచి ప్రవర్తిస్తున్నారు. వృత్తిని వ్యాపారంగా మార్చుకుంటున్నారు.

ఆసుపత్రికి వచ్చిన వారిపై దాడి జరిగింది ఇలా..

andhrapradesh,

ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం 41 నెంబర్‌ సదరం రూము వద్ద ప్రత్యేకంగా కోవిడ్‌ టెస్టును పరీక్షల కోసం ఏర్పాటు చేశారు. కాగా ఇద్దరు వ్యక్తులు అక్కడికి వ చ్చి కోవిడ్‌ టెస్టు చేస్తారా అని డ్యూటీలో ఉన్న డాక్టర్‌ను అడిగారు. ఒక్కడినే డ్యూటీలో ఉండటంతో సమాధానం చెప్పలేకపోయారు. పక్కనున్న ఆసుపత్రి టెక్నిషీయన్‌ అక్కడకు వచ్చి 99వ వార్డులో పరీక్షలు చేస్తారని దురుసుగా మాట్లాడారు. దీంతో నీకెందుకు డాక్టర్‌ ను అడుగుతున్నామం కదా అంటూ వారు సమాధానిమిచ్చారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఒకరిని ఒకరు దూషించుకున్నారు. అంతతో సరిపోక టెక్నీషియన్‌ రూములో నుండి బయటికి వచ్చి రోగిపై పడి పిడిగుద్దులు గుద్దడమే కాకుండా కాళ్లతో తన్ని రోడ్డు పైకి నెట్టి వేశాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ వారు కూడా వచ్చిన ఇద్దరు వ్యక్తులపై విరుచుకుపడ్డారు. ఆసుపత్రి సిబ్బంది అంతా ఏకమై ఆ ఇద్దరు వ్యక్తులను నోరు మూయించి పంపించేశారు. కళ్లెదుటే అక్కడ జరుగుతున్న దౌర్జన్య కాండను చూసి రోగుల పట్ల ఆసుపత్రి సిబ్బంది తీరు ఇలాగే ఉంటుందా.. సదరం సర్టిఫికెట్‌ కోసం వచ్చిన వారు కోవిడ్‌ టెస్టు చేయించుకునేందుకు వ చ్చినవారు అసహనం వ్యక్తం చేశారు. ఇంత దారుణం ఆసుపత్రి సిబ్బంది రోగులపై ఎలా చేస్తారంటూ మండిపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement