కణేకల్లు ప్రభన్యూస్: కర్ణాటక హోస్పెట్ (విజయనగరం) తుంగభద్ర డ్యాంకు విద్యుత్ కాంతి జలకళ నూతన శోభ సంతరించుకొంది. డ్యాం పరివాహక ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలకు తుఫాన్ తోడై జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా వరద ఉధృతి ఉప్పొంగి డ్యాంలోకి పరవళ్లు తొక్కుతోంది. ఫలితంగా డ్యాం సామర్థం 105.788 టీ-ఎంసీలకు 99.859 టీ-ఎంసీల మేరకు నీరు నిల్వతో 1633.00 డ్యాం అడుగుల మట్టంకు 1631 .51 అడుగుల స్థాయి మట్టం దాకా నీటి లభ్యత పెట్టుకొని డ్యాంలోకి ప్రవహిస్తున్నా 1,08,803 క్యూసెక్కుల వరద నీటిలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంకు మరియు దిగువ నదికి కలిపి ఆ క్యూసెక్యుల్లో 1,10,078 క్యూసెక్కుల వరద నీరు డ్యాం దిగువ నదికి వదులుతున్నారు.
ఇవాళ కూడా వరద ముంపు ప్రాంతాలకు అప్రమత్తత జాగ్రత్తల సూచన లేఖలు ఆయ ప్రాంతాలకు టీబీ బోర్డు సెక్రెటరీ నాగ మోహన్ పంపారు. ఇక డ్యాంలో 32 క్రస్ట్ గేట్ల ను 2.5 అడుగుల మేర షట్టర్లు ఎత్తి వరద నీరును దిగువ నదికి మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో 32 క్రస్ట్ గేట్లకు బుధవారం రాత్రి విద్యుత్ కాంతులతో కమనీయమైన అత్యంత సుందరంగా ముస్తాబు చేయడంతో వరద పారుతున్నా జలకళతో ఏకంగా డ్యాం కే కాంతి కళ ఉట్టిపడుతోంది.త్వరలోనే డ్యాంలో ప్రజానీకానికి సందర్శనకు అనుమతులు ఇచ్చేందుకు కృషి చేస్తామని డ్యాం సెక్రెటరీ చెప్పుకొచ్చారు.కరోనా కాలం నుంచి డ్యాం సందర్శనకు బ్రేక్ పడిన సంగతి విధితమే. ఈ సారి డ్యాం సందర్శనకు జన పోటు తాకిడి భారీస్థాయిలో ఉండొచ్చని అందుకు తగిన చర్యలు ముందస్తుగా చేపడుతామని ఆయన వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.