Saturday, November 23, 2024

ఆర్టీసీలో కారుణ్య నియ‌మాకాల‌కు గ్రీన్ సిగ్న‌ల్

అమరావతి, ఆంధ్రప్రభ: ఆర్టీసీలో 1168 పోస్టుల భర్తీకి కారుణ్య నియామకాలు చేపట్టేందుకు ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 29న ఆంధ్రప్రభ ప్రధాన సంచికలో ‘అధికారులు కారణ్యం చూపేనా!’ శీర్శికన వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, గతంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చేసిన ప్రయత్నాలను సవివరంగా వివరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ కేటగిరిల్లోని ఖాళీలను కారుణ్య నియామకాల కింద భర్తీ చేసేందుకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం పట్ల పీటీడీ(ఆర్‌సీ) నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసి యేషన్‌(ఎన్‌ఎంయూఏ) హర్షం ప్రకటించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు ఎన్‌ఎంయూఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వారొక ప్రకటన చేస్తూ 2016 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్‌ మధ్య సర్వీసులో మృతి చెందిన ఉద్యోగుల పిల్లలు, భార్యలకు జీవన భృతి కింద కారుణ్య నియామకాలు ఇవ్వలేదని వారు తెలిపారు.

ఇదే అంశంపై పలుమార్లు ఎన్‌ఎంయూఏ తరుపు ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వారు గుర్తు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి ఆదేశాల మేరకు జూనియర్‌ అసిస్టెం ట్‌, కండక్టర్‌, డ్రైవర్‌, శ్రామిక్‌ పోస్టుల ఖాళీలను వీరితో భర్తీ చేసేందుకు ఎండీ ద్వారకా తిరుమలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఆర్టీసీ విలీనం తర్వాత ప్రభుత్వంలో కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా తగిన న్యాయం చేయాలని వారు కోరా రు. కాగా ఆర్టీసీ(పీటీడీ) కార్మిక పరిషత్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌వీ శేషగిరిరావు, వై.శ్రీని వాసరావు, ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, చీఫ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పీ.సుబ్రమణ్యంరాజు, ఉప ప్రధాన కార్య దర్శులు జీవీ నరసయ్య, ఆవుల ప్రభాకర్‌, కోశాధికారి ఎండీఎ సిద్ధక్‌ వేర్వేరు ప్రకటనట్లో హర్షం ప్రకటిస్తూ ఎండీకి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement