రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో ఉన్న ప్రసిద్ధి ‘‘వైజాగ్’స్ దమ్ టీ’’ స్టాల్‌ను సందర్శించి సర్ ప్రైజ్ ఇచ్చారు. “ఇక్కడ చాయ్ చాలా బావుంటుందంట కదా?” అంటూ నిర్వాహకులతో సరదాగా ముచ్చటించారు.
కంచు పాత్రలో చిన్న కుండలో ప్రత్యేకంగా చేసే ‘టీ’ తయారీ విధానాన్ని పరిశీలించిన హోంమంత్రి స్వయంగా ‘‘తాందూరి టీ’’ని తయారు చేశారు. సడన్ గా వచ్చి సర్ప్రైజ్ చేయడమే కాకుండా కలుపుగోలుతనంతో హోంమంత్రి అనిత అనుకోని అతిథిలా వచ్చినందుకు నిర్వాహకులు థాంక్స్ చెప్పారు.