Friday, November 22, 2024

మా రాష్ట్రాల‌కు పంపండి మ‌హాప్ర‌భో…. సిఎంల‌కు హోం గార్డుల మొర‌..

అమరావతి, ఆంధ్రప్రభ:తెలంగాణాలో పని చేస్తున్న ఏపీ స్ధానికత కలిగిన హోంగార్డులకు మోక్షం కలగడం లేదు. ఇక్కడ కూడా అదే పరిస్ధితి నెలకొంది. ఏపీలోని వివిధ చోట్ల పని చేస్తున్న తెలంగాణా స్ధానికత కలిగిన హోంగార్డులకూ ఉూరట లేదు. వైసీపీ అధికారంలోకివచ్చి నాలుగేళ్ళు దాటిపోయింది. మరో ఏడాదిలో ఎన్నికలు రానున్నాయి. నేటికీ కనికరం చూపడం లేదంటూ వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హోంగా ర్డులుగా నియమితులైన అనేక మంది గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అనేక మంది వేరు పడినప్పటికీ.. నేటికీ ఏపీ స్ధానికత కలిగిన సుమారు 1000 మంది హోంగార్డులు తెలం గాణాలోని హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో వివిధ విభాగాల్లో ప్రస్తుతం పని చేస్తున్నారు.

అదేవిధంగా నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌, నల్గొండ, కోదాడ, సూర్యాపేట తదితర ప్రాంతాలకు చెందిన తెలంగాణా స్ధానికత కలిగిన హోంగార్డులు ఏపీలో పని చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో ఉన్న ఏపీ స్ధానికత కలిగిన హోంగార్డులు ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్‌ వరకు ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి చేసినందున వారంతా తెలంగాణాలో నాన్‌ లోకల్‌గా ప‌రిగణించబడుతున్నారు. వారి కుటుంబాలు ఏపీలో ఉన్నందున వారి తల్లి దండ్ర ులకు తోడుగా భార్య పిల్లలను ఉంచి ఉద్యోగరీత్యా అక్కడే ఉండాల్సిన పరిస్ధితి. కరోనా వచ్చిన రెండు సార్లు కూడా వీరి వెతలు వర్ణనాతీతం. దీంతో తమను స్వంత రాష్ట్రానికి పంపాలని అక్కడి తెలంగాణా ప్రభుత్వానికి మొర పెట్టుకు న్నారు. ఇదే సమయంలో ఏపీకి వచ్చేలా చర్యలు తీసుకోవా లని కోరుతూ తమ సమస్యను రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చేందుకు గత నాలుగే ళ్ళుగా చేస్తున్న ప్రయత్నాలు నేటికీ ఫలించలేదు. రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధుల ద్వారా నిత్యం ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. జగన్‌ సీఎం అయి నాలుగేళ్ళు దాటిపోగా, ఎన్నికలు దగ్గర పడిన నేపధ్యంలో ఇప్పుడు కాకపోతే వచ్చే ఏ ప్రభుత్వమూఇక తమను పట్టించుకోదనే నిర్ణయానికి హోంగార్డులు వచ్చేశారు. అయితే నిరంతరం తమ పోరాటాన్ని పరి గణనలోకి తీసుకున్న తెలంగాణా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అక్కడ పని చేస్తున్న ఏపీ స్ధానికత కలిగిన హోంగా ర్డుల జాబితా తీసుకుని వారిలో స్వంత రాష్ట్రానికి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్న వారిని పంపేందుకు ఏడాది క్రితం ఎన్‌ఓసీ జారీ చేసిం ది. ఈ నిరభ్యంతర పత్రం మన రాష్ట్ర ప్రభు త్వానికి పంపింది. అయి తే ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైల్‌ సీఎం టేబుల్‌పై పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చె ప్పడం గమనార్హం.

కోడ్‌ వస్తే ఇక అంతే..
తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ స్థానికత ఉన్న దాదాపు 465 మంది హోంగార్డ్స్‌ని అక్కడి ప్రభుత్వం పంపేందుకు ఇప్పటికే జారీ చేసిన ఎన్‌ఓసీకి ఏపీ ప్రభుత్వం మోక్షం కలిగించడం లేదు. దీనిపై ఇప్పటికే హోంశాఖ కసరత్తు చేసి మరింత సమాచారం కోసం డీజీ పీకి పంపడం జరిగింది. డీజీపీ సైతం ఏపీ పోలీసుశాఖ ఓపీని యన్‌ తెలియచేస్తూ రిఫర్‌ చేసింది. అయితే ప్రభుత్వ పరంగా ఆమో దం లభించాల్సి ఉంది. ఇందుకు ముఖ్యంగా ఆర్ధిక శాఖ కి ్లయరెన్స్‌ కావా లి. దీనిపై పలుమార్లు బాధిత హోంగార్డులు ఆరి ్ధక శాఖను, సీఎస్‌ను సంప్రదించినా.. అంతిమంగా సీఎం తేల్చాలనే సమాధా నమే వస్తోందని వారు చెబుతున్నారు. అయితే మరో ఎడాదిలో ఎ న్ని కలు రానున్నాయి. ఇంకో ఆరుమాసాల్లో తెలంగాణాలో ఎన్ని క లు జరుగనున్నాయి. అక్కడా ఇక్కడా ఐదారు మాసాల తేడాతో ఎ న్ని కల కోడ్‌ వస్తే ఇక ఈ సారికి తమ ఫైల్‌ మరుగున పడిపో తుం దని, దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం లేనందున వచ్చే ప్రభు త్వాలు పట్టించుకోడం ప్రశ్నార్ధకమేనని ఆందోళన చెందుతున్నారు.

ముంచుకొస్తున్న విద్యాసంవత్సరం..
మరోవైపు వీరి పిల్లల చదువులకు సంబంధించి స్ధానికత పెద్ద భారంగా మారింది. పని చేస్తున్న అక్కడ విద్యాసంస్ధల్లో చేర్చాలంటే ఆర్ధిక భారమే. పైగా సాంకేతికపరమైన సమస్యలు. అలాగని స్ధానిక త కలిగిన ఏపీలో చదివించాలంటే పిల్లలు, కుటుంబాన్ని వదిలి దూ రంగా ఉండే పరిస్ధితి. అటు ఇటు కాక ప్ర తీ విద్యా సంవత్సరంలో వీరి కి ఎదురయ్యే పెద్ద సమస్య. ఇప్పుడు కూడా వేసవి సెలవుల ముగి శాక కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది.ఈలోగా త మ సమ స్యకు జగన్‌ సర్కార్‌ పరిష్కారం చూపితే పిల్లల భవిష్యత్తు కోసం చదువు విషయంలో సరైన నిర్ణయం తీసుకోగలుగు తామని అంటు న్నారు. తమ సమస్యపై ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ సమా వేశాల్లో కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీదర్‌ రెడ్డి ప్రస్తావిం చడాన్ని గుర్తు చేస్తున్నారు. కాగా ఏపీలో కూడా తెలంగా ణా హోంగా ర్డులు ఉన్నందున వారిలో తమ రాష్ట్రానికి వెళ్ళేందు కు సిద్దంగా ఉన్న వారితో పరస్పర బదిలీ ప్రతిపాదన కూడా ప్రభు త్వం ముందు కు వచ్చింది. ఇప్పుడైనా మానవతాదృక్పధంతో జగన్‌ ప్ర భుత్వం ఏదొ కటి తేల్చాలని ఏపీ స్ధానికత హోంగార్డులు విఙ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement