ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు అంటే ఏకంగా 9 రోజుల పాటు సెలవులు ప్రకటించింది ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది ఇంటర్ బోర్డు. కరోనా మహమ్మారి విజృంభణ, సంక్రాంతి పండుగ నేపథ్యంలో…ఈ సెలవులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు సెలవులు వర్తిస్తాయని ఇంటర్మీడియట్ బోర్డ్ పేర్కొంది. సెలవు దినాల్లో క్లాసులు నిర్వహిస్తే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది బోర్డు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా ఇంటర్ బోర్డు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. అటు పాఠశాలలకు కూడా ఏపీ సర్కార్ సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital