Friday, December 27, 2024

Hoardings – అమ‌రావ‌తిలో మూడు కోతులు…

సోష‌ల్ మీడియాపై ప‌లు ప్రాంతాల‌లో ఫ్లెక్సీలు
మంచి కోస‌మే సోష‌ల్ మీడియా అంటూ నినాదాలు
అంద‌ర్నీ ఆలోచింప చేస్తున్న హోర్డింగ్స్ ..

అమ‌రావ‌తి – ఎపిలో సోషల్ మీడియా పోస్టింగ్స్‌పై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల మధ్య చాలా పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. సోషల్ మీడియాను వ్యక్తిగత దూషణలకు, దుష్ప్రచారాలకు, మహిళలను అవమానించడానికి ఉపయోగిస్తున్నారని అధికార ఎన్డీఏ కూటమి తీవ్ర చర్యలకు దిగింది. ప్రభుత్వాలను అస్థిర పరిచే కుట్రలకు కూడా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే సోషల్ మీడియా పోస్టింగ్స్ విషయంలో కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్న వాదన తెరపైకి వచ్చింది. దీనికి కేంద్ర మంత్రుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది..

ఈ క్రమంలోనే రాజధానిలో వెలసిన పెద్ద పెద్ద బ్యానర్లు, ప్లెక్స్‌లపై ఆసక్తి కర చర్చ నడుస్తోంది. చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు కనవద్దు అన్న మూడు కోతుల బొమ్మల గురించి అందరికి తెలిసింది. ఈ మూడు కోతుల బొమ్మను అనేక చోట్ల ఏర్పాటు చేస్తుంటారు. ఇప్పుడే అదే బొమ్మను ఉపయోగించి సోషల్ మీడియాలో చెడు ప్రచారం వద్దంటూ ఈ ప్లెక్స్‌లను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాను మన మంచి కోసం వాడుదాం అంటూ వెలసిన ప్లెక్స్‌లు అందరిని ఆలోచింప చేస్తున్నాయి. అసత్య ప్రచారాలకు దూషణలకు స్వస్తి పలుకుదాం అంటూ కూడా ఈ ప్లెక్సీల్లో పెట్టారు. అయితే వీటిని ఎవరూ ఏర్పాటు చేశారన్నఅన్న అంశంపై స్పష్టత లేదు.
అమరావతి రాజధానిలో పాటు విజయవాడ నగరంలో ఈ ప్లెక్సీలు వెలిశాయి. అయితే ప్రభుత్వం చట్టం తీసుకురావడానికి ముందే ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు స్థానికులు ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్లెక్స్‌లు పెట్టి ఉంటాయర్న భావన వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా మూడు కోతుల బొమ్మలతో సోషల్ మీడియాలో చెడు ప్రచారం వద్దన్న ప్లెక్స్‌లు మాత్రం టాక్ ఆప్ ధి టౌన్‌గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement