భారత్‌లో హెచ్‌ఎంపీవీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మైక్రోబయాలజిస్ట్‌లు, పిడియాట్రిషియన్లు, పల్మనాలజిస్టులు, ప్రివెంటివ్ మెడిస్ నిపుణులతో టాస్క్‌పోర్స్ కమిటీ నియమించాలని సీఎం ఆదేశించారు.
హెచ్‌ఎంపీవీ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు నమోదైన విషయాన్ని గుర్తు చేస్తూ.. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అక్యూట్ రెస్పిటరేటరీ ఇన్ఫెక్షన్ లాంటి శ్వాసకోశ వ్యాధులు, ఇన్‌ఫ్యూయెంజా లాంటి కేసుల్లో అప్రమత్తంగా ఉండాలసి సీఎం సూచించారు.
వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టాస్క్‌ఫోర్స్ నుంచి సలహాలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ వైరస్ సీజనల్ వ్యాధిగా సంక్రమిస్తున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఐసీఎంఆర్ అధీకృత వైరాలజీ ల్యాబ్‌లను సిద్ధం చేయాలని సూచించారు. వైరస్ టెస్టింగ్ కిట్లను కూడా సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించారు.