ప్రేమించి గుడిలో పెళ్లి చేసుకున్న నందు-స్నేహ
అనంతరం వరుడి ఇంటికి వచ్చిన జంట
బంధువుల సమక్షంలో 21న పెళ్లి చేస్తామన్నా పేరేంట్స్
పెళ్లి వచ్చి ఆశీర్వదించవలసిందిగా
తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన వధువు
కల్యాణ మండపంపై వధువు వర్గం దాడి
అక్కడున్న వారందరి కళ్లలో కారం
మెరుపు వేగంతో వధువుతో పరార్
కాసేపట్లో పెళ్లి.. బంధుమిత్రులు, మంగళ వాయిద్యాలతో మ్యారేజ్ ఫంక్షన్ కలకలలాడుతోంది. సడన్‌గా కారం చల్లుతూ ఫంక్షన్ హాలులోకి ఎంట్రీ ఇచ్చారు కొంతమంది వ్యక్తులు. ఈ క్రమంలో వరుడికి గాయాలయ్యాయి. అమ్మాయిని ఆమె బంధువులు తీసుకెళ్లడం జరిగిపోయింది. సినిమా స్టయిల్‌లో జరిగిన ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఈ ఘటన జరిగింది.
కడియం గ్రామానికి చెందిన బత్తిన వెంకటనందు ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఓ కళాశాలలో డిప్లొమా చదివాడు. అదే సమయంలో కర్నూలు జిల్లా చాలగమర్రి మండలం గొడిగనూరు గ్రామానికి చెందిన గంగవరం స్నేహ అక్కడే చదువు తోంది. నందు-స్నేహ మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. చదువు తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే పెద్దలు ఏమంటారని భయం మాత్రం ఇరువురిని వెంటాడింది.
దీంతో ఈనెల 13న విజయవాడలోని దుర్గగుడిలో పెళ్లి చేసుకున్నారు నందు-స్నేహ. అనంతరం కడియం వచ్చిన వెంకటనందు ఇంట్లో పెద్దలకు చెప్పడం, వాళ్లు అంగీకరించడం చకచకా జరిగిపోయింది. బంధువుల సమక్షంలో మరోసారి వివాహం చేసుకునేందుకు ఈనెల 21న ఆదివారం ముహూర్తం పెట్టుకున్నారు. ఇదే విషయాన్ని వధువు తన పేరెంట్స్‌కి తెలిపింది. అందుకు సంబంధించి వివాహ వేదిక, సమయంతో సహా తన తల్లిదండ్రులకు పంపుతూ వచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరింది.
అయితే కడియంలోని ఓ ఫంక్షన్ హాలులోకి వధువు తరపు బంధువులు అక్కడికి చేరుకుని పెళ్లికొడుకు, వాళ్ల బంధువులపై కారం చల్లారు. స్నేహను అపహరించేందు కు ప్రయత్నించారు. దీంతో పెళ్లికొడుకు వారిని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో నందుతో సహా, బంధువులకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం వధువును బలవంతంగా అక్కడ నుంచి ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చి అక్కడే ఉన్న కారులో ఎక్కించి వధువుని స్వగ్రామానికి తీసుకెళ్లారు. . ఈ ఘటనపై బత్తిన ఫ్యామిలీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసుల వధువును ఆచూకీ తెలుసుకుకేందుకు కర్నూలు జిల్లా గొడిగనూరుకు వెళ్లారు.