Saturday, November 23, 2024

Devotional | ఆయన ఇల్లే భగవంతుని ఆలయం.. మ్యూజియంగా మార్చాలన్నదే సంక‌ల్పం!

పుత్తూరు, (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : ఆయన గురించి ఆలోచిస్తే తొండమాన్ చక్రవర్తి కోరిక మేరకు కలియుగ వైకుంఠ నాధుడు వీట్టులో విరుందాయ్ పెరుమాళ్  శ్రీదేవి భూదేవి సమేతుడై  వెలిశారని స్థల పురాణం స్ఫురణకు వస్తుంది. ఎందుకంటే తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలోని రామానాయుడు కాలనీలో 86 యేళ్ల  విశ్రాంత వ్యవసాయ అధికారి భాస్కర్ రెఢ్ఢి ఇల్లు కూడా భగవంతుని కొలువుగా అనిపిస్తుంది. నిరంతర  భాగవత పారాయణం చేయడమే కాక  తన ఇంట్లో సర్వ దేవతామూర్తులు చిత్ర పటాలు ఏర్పాటు చేసి ఇల్లాంతా స్వామీ అమ్మవార్ల దృశ్య మాలికలతో తీర్చి దిద్దారు. తన సంపాదన మొత్తాన్ని దేవతామూర్తులు చిత్ర రూపాల కోసం వెచ్చించారు.

భవిష్యత్తులో తన నివాస గృహాన్ని ఓ భాగవత మ్యూజియంగా మార్చాలన్న ధ్యేయంగా ఇలా ఇల్లాంతా దేవతామూర్తులు ఏర్పాటు చేసినట్లు భాస్కర్ రెఢ్ఢి తెలిపారు. అయితే భాస్కర్ రెడ్డి పుత్తూరు పట్టణంలోని కామాక్షి సమేత, సదాశివేశ్వర ఆలయ ప్రాంగణంలో వెలసియుండు శ్రీకృష్ణ మందిరంలో 10 సంవత్సరాల భాగవత బోధన చేశానని, 66వ సంవత్సరం వరకు 51 సార్లు తిరుమల తిరుపతి పాదయాత్ర చేశానని చెప్పారు. అనంతరం వయో భారంతో తన నివాసాన్ని ఆలయంగా చేసుకుని భగవంతుని సేవలో తరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement