Friday, October 18, 2024

AP | ఆళ్లగడ్డలో హైటెన్షన్… భూమా, ఏవీ మధ్య వార్

… సై అంటే సై..
… టిడిపి నాయకుల మధ్య బహిరంగ వార్…
… ఎమ్మెల్యే అఖిలప్రియ వర్సెస్ ఏవి సుబ్బారెడ్డి..
.. ఎమ్మెల్యే అఖిలప్రియ రూట్ సపరేట్…
… కయ్యానికి కాలుతున్న ఎమ్మెల్యే..
.. ఆళ్లగడ్డ పట్టణం వదిలి వెళ్లాలని ఎమ్మెల్యే టిడిపి నాయకుడు ఏవి సుబ్బారెడ్డికి అల్టిమేట్ జారి …
… ఆళ్లగడ్డ లోనే ఉంటా.. ఎవరేం చేస్తారో చూస్తా ఏవి సుబ్బారెడ్డి..
.. ఏవి సుబ్బారెడ్డి ఇంటిదగ్గర పోలీసు బందోబస్తు..
.. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి…


నంద్యాల : ఒకనాటి ఫ్యాక్షన్ గడ్డ ఆళ్లగడ్డ.. గత 15 సంవత్సరాలుగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని గత పాలకుల పర్యవేక్షణలోనూ అధికారులు తీసుకుంటున్న జాగ్రత్తలతోనూ ఇప్పటివరకు ప్రశాంతంగా ఉంది. మాజీ పార్లమెంట్ సభ్యుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన భూమా నాగిరెడ్డికి అదే ప్రాంతానికి చెందిన ఏవీ సుబ్బారెడ్డి మంచి స్నేహితులు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఏవీ సుబ్బారెడ్డికి అఖిలప్రియకు మధ్య అంతర్యుద్ధం కొనసాగుతుంది. గతంలో వీరిరువురి మధ్య మాటల తూటాలు పేలాయి. కేసుల వరకు వెళ్లాయి. వారి ఇరువురి మధ్య ఒకదాని ఒకటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

గురువారం రాత్రి ఆళ్లగడ్డ చేరుకున్న ఏవీ సుబ్బారెడ్డికి భూమా అఖిలప్రియ అల్టిమేటం జారీ చేశారు. ఆళ్లగడ్డ పట్టణం వదిలి వెళ్లాలని తెలపటంతో పోలీసులు ఏవీ సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లి మీరు నంద్యాలకు చేరుకోవాలని శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని తెలిపారు. అయితే అప్పుడు ఒప్పుకొని ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ కార్యకర్తలకు అండగా ఇక్కడే ఉంటానని తేల్చి చెప్పారు. ఏం జరిగినా తేల్చుకుంటానని, తెలపడంతో ఆయన ఇంటి వద్ద అళ్లగడ్డలో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

- Advertisement -

ఆళ్లగడ్డలో భారీగా మోహరించిన పోలీసులు..
నాలుగు సంవత్సరాలుగా వీరిరువురి మధ్య ఉన్న ఘర్షణలు శుక్రవారం తీవ్ర స్థాయికి చేరాయి. ఎన్నికల ముందు నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా నంద్యాల నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామం వద్ద ఇరువర్గాల వారు కర్రలతో దాడి చేసుకున్నారు. ఆనాడు ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు. ఎన్నికల ముందు ఆళ్లగడ్డలో జరిగిన బహిరంగ సభలో కూడా ఈ సభకు ఏవీ సుబ్బారెడ్డి రాకూడదని అల్టిమేట్ జారీ చేశారు. ఆనాడు పార్టీ పెద్దలు కలుగజేసుకుని మీరు కలిసి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. అఖిలప్రియ వర్గీయుడిగా ఉన్న నిఖిల్ పై ఓ రోజు అర్ధరాత్రి కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేశారు. వెంటనే ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా కోలుకున్నారు. ఈ హత్యాయత్నం ఏవీ సుబ్బారెడ్డి అనుచరులతో చేయించార‌ని ఆరోపణలు భూమా వర్గీయులు చేయడం విశేషం.

ఎన్నికలు జరిగాయి.. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా భూమా అఖిలప్రియ గెలుపొందారు. గెలిచిన తర్వాత ఆళ్లగడ్డలో ఉన్న ఏవీ ఆస్తులపైన‌, బార్ అండ్ రెస్టారెంట్ పై వర్గీయులు రాళ్లు వేసిన సంఘటన జరిగింది. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం తాజా పరిణామాలతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆళ్లగడ్డ ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉండగానే ఆళ్లగడ్డలో నేను కూడా సినిమా చూపిస్తానని కార్యకర్తలతో ఏవీ అన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మాటతో ఏవీ సుబ్బారెడ్డి వర్గం కార్యకర్తలకు బూస్ట్ ఇచ్చినట్లు అయిందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా ఇరువురి మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించటానికి అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పటిదాకా ఫలించలేదు. ఈ సంఘటనతో ఆళ్లగడ్డలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అధిష్టానం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఇంటెలిజెన్స్ పోలీసుల నుంచి ప్రభుత్వం నివేదిక తెప్పించుకుందని పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement