Tuesday, November 26, 2024

దేవినేని ఉమ అరెస్టులో హైడ్రామా.. మాజీ మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు

టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ అరెస్టులో హైడ్రామా చోటు చేసుకుంది. దేవినేని ఉమను పెదపారుపూడి పోలీస్ స్టేషన్ నుంచి నందివాడ పీఎస్‌కు తరలించారు. ఈ క్రమంలోనే నందివాడ గ్రామ సరిహద్దులు పోలీసుల నిర్బంధంలో ఉన్నాయి. నందివాడ పోలీస్ స్టేషన్ కి వెళ్లే రహదారులను ఐదు కిలోమీటర్ల ముందే దిగ్బంధనం చేశారు.  స్థానికులను సైతం ఆధార్ కార్డు ఉంటేనే అనుమతిస్తున్నారు. మీడియాను కూడా పోలీస్ స్టేషన్ దగ్గరకు పోలీసులు అనుమతించలేదు. పీఎస్ పరిసర ప్రాంతాలకు ఎవరూ రాకుండా బారికేడ్లు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

మరోవైపు దేవినేని ఉమను తమ కస్టడీ లోనే ఉన్నారని కృష్ణా జిల్లా ఎస్పీ సిదర్ధార్ధ్ కౌశల్ తెలిపారు. ఉమ శాంతి భద్రతల కు విఘాతం కలించారని తెలిపారు. 100% ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు. దేవినేని ఉమపై కంప్లైంట్ ఆధరంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు.

దేవినేని ఉమ ఉద్దేశ పూర్వకంగా ముందస్తు ప్రణాళికతో జి.కొండూరులో అలజడి‌ సృష్టించారని ఏలూరు రెంజ్ డీఐజీ మోహనరావు ఆరోపించారు. ఊదేశపూర్వకగానే దేవినేని ఉమ వివాదం సృష్టించారని తెలిపారు. ముందోస్తు పథకంలో భాగంగా దుర్దేశం పూర్వకంగా ఉమ కొండపల్లి నుంచి తన అనుచరులతో వెళ్లారని చెప్పారు.  ఆలజడికి దేవినేని ఉమ కారణం అని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలను రెచ్చ కొటే విధంగా ఉమ వ్యహరించారని తెలిపారు.

ఇది కూడా చదవండి: టీడీపీ నేత దేవినేని ఉమపై రాళ్ల దాడి

Advertisement

తాజా వార్తలు

Advertisement