దేశ వ్యాప్తంగా కరోనా భయపెడుతున్న వేళ.. అందరి చూపు నెల్లూరు కృష్ణపట్నం వైపే పడింది. ఆనందయ్య ఆయుర్వేద మందు కరోనాపై పనిచేస్తుందా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రాకపోయినా.. జనం మాత్రం ఆ ముందును బాగా నమ్ముతున్నారు. వేల సంఖ్యలో జనం ఆ మందు కోసం ఎగబడుతున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. దేశవ్యాప్తంగా అందరూ ఈ మందు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఆనందయ్య ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆనందయ్య ను అరెస్టు చేసి తీసుకు వెళతారని వదంతులు గుప్పుమన్నాయి. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు రావడంతో కృష్ణ పట్నంలోని వందల మంది ఆనందయ్యకు మద్దతుగా రావడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే, ఆనందయ్య స్వయంగా బయటకు వచ్చి గ్రామస్థులతో మాట్లాడారు. తాను ఎక్కడికి వెళ్లడం లేదన్న ఆనందయ్య.. ప్రభుత్వం నుంచి అనుమతులు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. అనుమతులు రాగానే అందరికీ మందు పంపీణీ చేస్తానని చెప్పారు. దీంతో గ్రామస్థులు శాంతించారు.