Friday, November 22, 2024

Breaking: విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద హై టెన్షన్

విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద హై టెన్షన్ నెలకొంది. అత్యాచార బాధితురాలని పరామర్శించేందుకు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అక్కడికి చేరుకున్నారు. అయితే వాసిరెడ్డి పద్మను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆస్పత్రి ముందు టీడీపీ కార్యకర్తలు బైఠాయించారు. ఈ క్రమంలో అక్కడికి టీడీపీ అధినేత చంద్రబాబు రావడంతో ఆయన మద్దతుదారులు నినాదాలు చేయడంతో ఆందోళన మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఈక్రమంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తల నినాదాల మధ్యనే వాసిరెడ్డి పద్మ బాధితురాలిని పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement