Tuesday, November 26, 2024

నాగార్జున సాగర్ వద్ద హై టెన్షన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల మధ్య జలవివాదం ముదురుతోంది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాగర్‌ జలవిద్యుత్‌ కేం‍ద్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తిని ఆపాలంటూ ఏపీ అధికారులు గురువారం మెమొరాండం ఇవ్వడానికి వచ్చారు. అయితే, తెలంగాణ పోలీసులు ఏపీ అధికారులను సాగర్‌ బ్రిడ్జిపైనే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సాగర్‌ రైట్‌ కెనాల్‌ ఎస్‌ఈ గంగరాజు ఆధ్వర్యంలోని ఏపీ అధికారుల బృందం ఇచ్చిన మెమొరాండంను తెలంగాణ జెన్‌కో అధికారులు తిరస్కరించారు. ఫ్యాక్స్‌లో లేఖ పంపాలంటూ ఏపీ అధికారులతో పేర్కొన్నారు. దీంతో వారు అక్కడినుంచి వెనుదిరిగారు.

ఈ సందర్భంగా ఎస్‌ఈ పురషోత్తం గంగరాజు మాట్లాడుతూ.. విద్యుత్ ఉత్పత్తి కోసం సాగర్ మెయిన్ కెనాల్ ద్వారా.. తెలంగాణ అధికారులు నీటిని కిందికి వదులుతున్నారని తెలిపారు. సాగర్ నుంచి వెళ్లిన నీరు పులిచింతల వద్ద వదిలేయడంతో.. నీరంతా వృథగా సముద్రంలో కలుస్తుందన్నారు. మనం ఇంకా వ్యవసాయ సీజన్‌ మొదట్లోనే ఉన్నామని, రైట్ కెనాల్‌ కింద 11 లక్షల 15 వేల ఎకరాల సాగు చేస్తున్నారని తెలిపారు.  వచ్చిన నీటిని వచ్చినట్టే వదిలేయడంతో రైతుల ఆశను ఒమ్ము చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ఉత్పత్తి ఆపాలని తెలంగాణ అధికారులకు మెమోరాండం ఇచ్చేందుకు వెళ్తే.. తెలంగాణ పోలీసులు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు చెప్పారు.

ఇది కూడా చదవండి: తెరుచుకున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement