తిరుపతి సిటీ, ఫిబ్రవరి 4 (ప్రభ న్యూస్) : రవాణాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు, రిఫ్లెక్టివ్ టేప్ లు తప్పనిసరి చేయడమైనదని జిల్లా రవాణా శాఖ అధికారి సీతారామి రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్టీవో సీతారామరెడ్డి మాట్లాడుతూ.. వాహనదారులందరూ aprtacitizen.epragathi.org వెబ్ సైట్ నందు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల ఏర్పాటుకు ( హెచ్ ఎస్ ఆర్ పి) స్లాట్ నమోదు చేసుకున్న యెడల, తదుపరి సమాచారం సంబంధిత వ్యక్తులకు సంక్షిప్త సందేశం ద్వారా తెలియజేయబడుతుందని, ఇప్పటి వరకు హెచ్.ఎస్.ఆర్.పి. ప్లేట్లు లేని వారందరు కూడా వారి వాహనాలకు పాత వాహనాలతో సహా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ప్రతి వాహనానికి రిఫ్లెక్టీవ్ టేప్ లు కూడా తప్పనిసరి చేయడమైనదని వారు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement