Friday, November 22, 2024

AP | విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం.. శొంఠ్యాంలో ఆయుర్వేద మందుల గిడ్డంగి, ప్రయోగశాల ఏర్పాటు

విశాఖపట్నం బ్యూరో, (ప్రభ న్యూస్‌): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఈ రెండు రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు జిల్లా ఇన్​చార్జి, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి విడదల రజని అన్నారు.

సోమవారం సాయత్రం ఆనందపురం మండలం శొంఠ్యాంలో రూ.6.67 కోట్లతో నిర్మించనున్న ఆయుర్వేద మందుల గిడ్డంగి, ఔషధ పరీక్షల ప్రయోగశాల భవన నిర్మాణానికి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ డాక్టర్​ ఎ. మల్లికార్జునతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ.. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ప్రజలకు ఉపయోగపడే వైద్యం ఆయుర్వేదమని, అటువంటి వైద్యం ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఆచరిస్తున్నాయన్నారు. ఇది మనకు ఎంతో గర్వకారణమని అన్నారు. కొన్ని రకాల దీర్ఘకాల రుగ్మతలకు ఆయుర్వేదం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఆయుర్వేద వైద్యానికి ఇప్పుడు ఏపీలో ఎంతో ప్రాముఖ్యత కల్పిస్తూ రూ. 6.67 కోట్లతో ఆయుర్వేద మందుల గిడ్డంగి, ఔషధ పరీక్షల ప్రయోగశాల విశాఖపట్నం, శొంఠ్యాంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని మంత్రి రజనీ అన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేశారు. ఈ ల్యాబ్ ఏర్పాటు వలన సుమారు 100 నుంచి 150 మందికి ఉద్యోగ భృతి కలుగుతుందని అన్నారు. ఇక్కడ రాష్ట్రవ్యాప్త ఆయుర్వేద గిడ్డంగి మరియు రాష్ట్రంలో తయారైన ఆయుర్వేద మందులకు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement