ఇటీవల ఏపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించింది. దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు… ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించే రూల్ పై స్టే విధించింది.
ఆ అభ్యర్థులను అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. బీఈడీ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు అనుమతించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. బీఈడీ అభ్యర్థులను అనుమతించే రూల్‌పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీచేసింది.