Monday, November 18, 2024

మునిసిప‌ల్ పాఠ‌శాల‌లు విలీనంపై హైకోర్టు స్టే…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ పాఠశాలలను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వ గతేడాది జూన్‌లో మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలల పర్యవేక్షణను పాఠశాల విద్యాశాఖకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో 84ను విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మన్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ (ఎంటీఎఫ్) అధ్యక్షులు రామకృష్ణ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మునిసిపల్ పాఠశాలల పర్యవేక్షణ, నిర్వహణను పాఠశాల విద్యా శాఖ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి తమ సమస్యలు పెరిగాయని ఎంటీఎఫ్ నాయకులు వాపోతున్నారు. అయితే ఎంటీఎఫ్ అధ్యక్షులు రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలోనే మున్సిపల్ పాఠశాలలను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement