Thursday, November 21, 2024

జ‌గ‌న్ కు ఎదురుదెబ్బ – ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణాల‌పై హైకోర్టు స్టే….

అమ‌రావ‌తి – జ‌గ‌న్ స‌ర్కార్ కు ఎపి హైకోర్టులో మ‌రోసారి ఎదురుదెబ్బ త‌గిలింది.. అమ‌రావ‌తిలోని ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణాల‌కు హైకోర్టు నో చెప్పింది.. వెంట‌నే అక్క‌డ నిర్మాణాల‌ను నిలిపివేయాలంటూ త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం నేడు మ‌థ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.. ఈ జోన్ లో ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి జగన్ పదిరోజుల క్రితం భూమి పూజ చేశారు..తాజా హైకోర్టు తీర్పుతో అక్కడ నిర్మాణ పనులు నిలిచిపోనున్నాయి.

కాగా,  రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు, 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు, ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ ఐకాస హైకోర్టులో వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరిలతో కూడిన ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement